Caste Certificate

కుల ధృవీకరణ పత్రము (Community and Date of Birth Certificate): Caste Certificate through Meeseva: కుల ధృవీకరణ పత్రముని సంబంధిత MRO ఆఫీసు నుండి పొందాలి దానికోసము ముందుగా జిరాక్స్ సెంటర్ నందు ఒక దరఖాస్తు పత్రము మరియు కావల్సిన పత్రాలు అన్నీ జిరాక్స్ ప్రతులు జతచేసి మీసేవ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేసుకోవాలి దానికోసం మీసేవ కేంద్రములో రశీదు రుసుము రూ.45/- (ప్రస్తుత వెల) వుంటుంది మరియు సరియగు అన్నీ పత్రాలు, మీసేవలో చెల్లించిన రశీదు జతచేసి మండల కార్యాలయంలో (MRO Office) సమర్పించాలి అప్పుడు ఎం‌ఆర్‌ఐ (MRI) వారు ధృవీకరించిన తరువాత ఎం‌ఆర్‌ఓ (MRO) వారు నేరుగా మీసేవలో డిజిటల్ సైన్ (Digital Sign) చేయటం ద్వారా పూర్తి అగును. దరఖాస్తుదారు మళ్ళీ నేరుగా ఎక్కడైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ మీసేవ కేంద్రము వద్ద కుల ధృవీకరణ పత్రమును ప్రింట్ తీసుకోవచ్చు దానికోసము మళ్ళీ ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరము లేదు, లేదా మీకు వీలు కల్గిన ఏదేని దగ్గరలో వున్న మీసేవ కేంద్రము ద్వారా కూడా మీరు అప్లై చేసిన రశీదు నెంబర్ అనగా ట్రాన్సాక్షన్ నెంబర్, ఆన్లైన్ పక్రియలో మీరు నమోదు చేసిన ఫోన్ నెంబర్ కి వచ్చిన ఓ.టి.పి సాహాయంతో ప్రింటింగ్ ఛార్జీ (రూ.15) చెల్లించి తీసుకోవచ్చు. మీసేవ యొక్క కుల ధృవీకరణ పత్రము అప్లికేషన్ నెంబర్ CND0 ఇలా మొదలు అవుతుంది గమనించవచ్చు.

గమనిక: సర్టిఫికేట్ ఒక సారి ప్రింట్ తీసాక మళ్ళీ అదే ట్రాన్సాక్షన్ పై తీసుకునే సదుపాయము అయితే లేదు, వీలైతే మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే మరియు తీసుకున్న కుల దృవీకరణ పత్రము చెల్లుబాటు కాలము అయితే లేదు! కుల ధృవీకరణ పత్రము అందరూ SC / ST / BC కులాల వారు తీసుకోవడానికి వీలు వుంది అయితే మళ్ళీ BC లో BC-A / BC-B / BC- C / BC-D / BC-E అని వర్గాలు వుంటాయి.

కావల్సిన పత్రాలు జత చేయాల్సినవి:

1) దరఖాస్తు పత్రము (తప్పని సరీ)
2) ఆధార్ కార్డ్ జిరాక్స్ (తప్పని సరీ)
3) కొత్త రేషన్ కార్డ్ జిరాక్స్ (లేనిచో అవసరం లేదు)
4) పదవ తరగతి మెమో / ఏదేని వయస్సు ధృవీకరణ / జనన ధృవీకరణ పత్రము (లేనిచో అవసరం లేదు)
5) ఇది వరకు మీరు కానీ / కుటుంభీకులు తీసుకున్న కుల దృవీకరణ పత్రము వుంటే (లేనిచో అవసరం లేదు)

మీసేవ కేంద్ర నిర్వాహకులు స్కానింగ్ చేసి అప్లోడ్ చేయునప్పుడు అన్ని దిగుమతులు కలిపి 3MB కి మించకుండా .pdf గా స్కానింగ్ చేయాలి (ఒక్కో పి‌డి‌ఎఫ్ 300-400 కే‌బి కి మించకుండా చూసుకుంటే మంచిది) మొత్తము మూడు pdf లు ఒక అప్లికేషన్, ఆధార్ మరియు కొత్త రేషన్ కార్డు ప్రతిని స్కాన్ చేసి అప్లికేషన్ ని పూర్తి చేయవచ్చు; ఎలాగు physical కాపీని అధికారులకి సమర్పిస్తాము కావున వారు నేరుగా అన్ని జిరాక్స్ ప్రతులని పరీక్షిస్తారు!

Write a comment ...

TeluguForms

Show your support

మీ యొక్క వీలైనంత ఆర్ధిక సహాయము వలన మేము మరింత సమయాన్ని కేటాయించి ఉపయోగకరమైన పోస్టులు మరియు దరఖాస్తు నమూనా ప్రతులు ఇంకా ఎన్నో తయారు చేయగలము_ వాటిని మీతో కొన్ని ఉచితముగా కూడా పంచుకోగలము!

Recent Supporters

Write a comment ...

TeluguForms

తెలుగు ఫామ్స్.ఇన్ _ తెలుగు సాంకేతిక సమాచారము & దరఖాస్తు నమూనా పత్రాలు @ https://teluguforms.stck.me/ & https://teluguforms.in/ వెంటనే ఫాలో చేయండి.