Required Documents for Kalyana Lakshmi Scheme Telangana: ముందుగా మీరు మీసేవా కేంద్రము లేదా ఏదేని జిరాక్స్ సెంటర్ వద్ద కళ్యాణ లక్ష్మి సంబంధిత దరఖాస్తు పత్రము తీసుకుని లేదా ఈ బ్లాగు చివరన ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ని మీరు నేరుగా డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకుని అందులో వున్న
తల్లి ,తండ్రి, వధువు యొక్క వాఙ్మూలము లో (ఇందులో తండ్రి మరియు తల్లి, వధువు యొక్క సంతకముతో పాటు ముగ్గురు సాక్షుల సంతకాలు తీసుకుని వారియొక్క ఆధార్ కార్డు ప్రతిని జతపరచాలి మరియు వారి ఆధార్ జిరాక్స్ పై వారి సంతకము కూడా తీసుకోవాలి),
వి.ఆర్.ఓ సర్టిఫికేట్ (ప్రస్తుతము విఆర్‌ఓ ఆఫీసర్ లేరు కనుక పూర్తి అప్లికేషన్ అయ్యాక ఎలాగూ MRO ఆఫీస్ లో submit చేయాలి కాబట్టి ఆఫీస్ లో MRI గారు ధృవీకరిస్తారు)
ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ (గెజిటెడ్ అధికారిచే దృవీకరించాలి)
గవర్నమెంట్ ఉద్యోగి వాఙ్మూలము (ఇద్దరివి తీసుకోవాలి మరియు వారి యొక్క ప్రభుత్వ ఉద్యోగ ఐడి కార్డు జిరాక్స్ కూడా తీసుకోవాలి మరియు వాటిపై వారి సంతకము కూడా వుండాలి)
వధువు తరువున కావాల్సినవి:
వధువు యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్
వధువు యొక్క వయస్సు ధృవీకరణ పత్రము [ ఎస్‌ఎస్‌సి మెమో (లేదా) బర్త్ సర్టిఫికేట్ (లేదా) ఫిజికల్ హెల్త్ అండ్ ఏజ్ సర్టిఫికేట్]
కొత్త రేషన్ కార్డ్ #
వధువు తల్లి ఆధార్ కార్డ్ జిరాక్స్
వధువు తల్లి బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్
పెండ్లి పత్రిక (1)
పెండ్లి ఫోటోలు (3 రకములు)
వధువు పాస్ ఫోటో గ్రాఫ్ (1)
కుల ధృవీకరణ పత్రము
ఆదాయ ధృవీకరణ పత్రము
నివాస ధృవీకరణ పత్రము
మ్యారేజ్ సర్టిఫికేట్ ( వివాహము జరిగిన గ్రామ పంచాయతీ లేదా రిజిస్ట్రార్ కార్యాలయము ద్వారా తీసుకోవచ్చు)
గ్రామ పంచాయతీ లెటర్ హెడ్ (అవసరం ఉన్నచో)
వరుడి తరుపున కావాల్సినవి:
వరుడి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్
పెండ్లి పత్రిక (1)
వరుడి యొక్క వయస్సు ధృవీకరణ పత్రము [ ఎస్‌ఎస్‌సి మెమో (లేదా) బర్త్ సర్టిఫికేట్ (లేదా) ఫిజికల్ హెల్త్ అండ్ ఏజ్ సర్టిఫికేట్]
కుల ధృవీకరణ పత్రము మీసేవ
ఆదాయ ధృవీకరణ పత్రము మీసేవ (వున్నచో)
నివాస ధృవీకరణ పత్రము మీసేవ
కొత్త రేషన్ కార్డ్ (వున్నచో)
గమనిక:- అన్నీ జిరాక్స్ ప్రతులపై గెజిటెడ్ అధికారిచే సంతకము చేపియ్యవలెను!
విధానము : ముందుగా వివాహము అయిన తరువాత వివాహము జరిగిన ప్రాంతము నుండి వివాహ దృవీకరణ పత్రము (మ్యారేజ్ సర్టిఫికేట్) తీసుకున్నాక పై పత్రాలు జతపరచి ఈ-పాస్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి!
Write a comment ...